కొనసాగుతున్న విచారణ.. కొలిక్కిరాని పంచాయితీ

62చూసినవారు
కొనసాగుతున్న విచారణ.. కొలిక్కిరాని పంచాయితీ
శంకరపట్నం తహసిల్దార్ కార్యాలయాన్ని హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు గురువారం సందర్శించారు. మండలానికి చెందిన పొద్దుటూరి శంకరమ్మ ఫిర్యాదుతో కలెక్టర్ ఆదేశాల మేర ఆర్డిఓ విచారణ చేపట్టారు. శంకరమ్మ కొడుకు పొద్దుటూరు వీరారెడ్డి ఇటీవల మరణించగా ఆయన పేరున ఉన్న భూమిని వీరారెడ్డి కుమార్తెలు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న వాదనతో విచారణ జరుగుతుంది. విచారణ అనంతరం పూర్తి నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నారు.

సంబంధిత పోస్ట్