రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బాకూరు పల్లి బ్రిడ్జి అతి ప్రమాదకరంగా మారింది. బాక్రుపల్లి గ్రామం నుండి తండా వెళ్లే మార్గంలో మైసమ్మ చెరువు కింద వాగు వెంటనే నిర్మించాలని ప్రజలు కోరారు. బ్రిడ్జిని నిర్మించిన రెండు సంవత్సరాలు గడవకముందే కూలిపోవడం కాంట్రాక్టర్ నాణ్యత లోపం వల్లనే జరిగిందంటూ గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేశారు.