సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ లో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. పద్మ నగర్కు చెందిన నాగిశెట్టి ప్రసాద్ సైకిల్ పై వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రుడిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రసాద్ మృతి చెందినట్లు చెప్పారు.