సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 22వ వార్డులో నేత కార్మికుడు ఎర్రం కొమరయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. గత 8 నెలల నుంచి ఉపాధి లేకపోవటంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. బుధవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య కమల, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.