రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తెల్లవారుజామున యువకుడి దారుణ హత్య. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రికి చెందిన రషీద్ (35) పోలీసులు గుర్తించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో డాక్యుమెంట్ రైటర్ గా మృతుడు రషీద్ పని చేస్తున్నాడు. మృతునికి భార్య సీరిన్ ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి విచారణ పోలీసులు విచారణ చేపట్టారు.