రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవునితండాలో పాడి గేదెపై శనివారం తెల్లవారుజామున చిరుత పులి దాడి చేసింది. స్థానికులు తెలిపిన వివరాలు. దేవుని తండాకు చెందిన రైతు సరి లాల్కు చెందిన గేదెపై చిరుత దాడి చేసింది. తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. రైతును ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.