విజయవాడలో ఒక్క పక్క వరదలు, మరో పక్క భారీ వర్షాలు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వారం రోజుల పాటు వర్షాలు విజయవాడను వణికించాయి. వరదలతో అతాలకుతలమైన బెజవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సోమవారం వర్షం పడకపోవడంతో సహాయక చర్యలు వేగంగా జరిగాయి. వ్యాధులపై ఇంటింటికి సర్వే, బైకులు, కార్లు రిపేర్లు వంటి సహాయక చర్యలు ప్రభుత్వం అందించింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ గేట్ల స్థానంలో కొత్తవాటిని అమర్చారు.