విజయవాడలోని అజిత్‌నగర్ షాదిఖానా రోడ్డులో వరద బాధితుడిపై వీఆర్వో జయలక్ష్మి చెయ్యి చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. వీఆర్వో జయలక్ష్మిని విధుల నుంచి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తప్పించారు. ఈ మేరకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.