మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరొన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాని, దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి, కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ చేసిన సేవలు దేశం ఎన్నటికి మరిచిపోదన్నారు. నిజాయితీ, మంచితనం, సమర్థవంతంగా పని చేయడంలాంటివి మన్మోహన్ సింగ్ ను చూసి నేర్చుకోవాలన్నారు.