కూలీ మృతి.. ఎదురుగట్ల గ్రామంలో విషాదం

2276చూసినవారు
కూలీ మృతి.. ఎదురుగట్ల గ్రామంలో విషాదం
సెంట్రింగ్ కూలీగా పనులు ముగించుకుని ఇంటికి వచ్చి గుండె నొప్పితో మృత్యువాత పడ్డ సంఘటన విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని ఎదురుగట్ల గ్రామంలో చంద్రగిరి అంజయ్య (46) అనే కూలీ ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్