వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని బుధవారం వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి చేరుకోవడంతో ఆలయ అధికారులు అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.