న్యాయం కావాలంటూ వేదన వ్యక్తం చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు

80చూసినవారు
న్యాయం కావాలంటూ వేములవాడ ఏరియా ఆసుపత్రి ముందు బాధిత కుటుంబ సభ్యులు బైఠాయించి వేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బుధవారం రషిద్ అనే వ్యక్తిని హత్య చేశారు. మృతుని కుటుంబ సభ్యులు భార్య, తల్లి మీడియాతో మాట్లాడుతూ. కావాలనే తన కుమారున్ని హత్య చేశారని అన్నారు. ఏరియా ఆసుపత్రి వద్ద అధిక సంఖ్యలో మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు చేరుకున్నారు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపించడం కోసం బయలుదేరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్