రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద 17బెటాలియన్ పోలీసుల భార్యలు రోడ్డుపై ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పోలీస్ విధానాన్ని అమలు పరుచాలని కోరారు. రోడ్డెక్కిన పోలీసు భార్యలను అదుపులోకి తీసుకొనిమహిళలను అరెస్ట్ చేసి 17 బెటాలియన్ కు తరలించారు.