విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కెజీబివి అర్బన్ పాఠశాల విద్యార్థినిలకు బుధవారం వేములవాడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి దుప్పట్లు పంపిణీ చేశారు. నాగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు దాతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ వీరప్రసాద్, ట్రస్ట్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.