ఇంటి నిర్మాణం కోసం ఉంచిన సలాక చోరీ
ఇంటి నిర్మాణం కోసం ఉంచిన సలాకాను గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో బెస్త నరేష్ అనే వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం తీసుకువచ్చిన సలాకాను గుర్తు తెలియని వ్యక్తి దొంగలించాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.