రాజన్న సిరిసిల్ల జిల్లాఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఆరు నెలల పంటను అకాల వర్షాలతో వడ్లు సగం రాలిపోయి తీవ్ర దిగ్భ్రాంతి కి గురైన రైతులు. వడ్లు కోసిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక అధికారుల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, కాంటాలు ఓపెనింగ్ చేసి పది పదిహేను రోజులు గడుస్తున్నా, పేరుకే ఓపెనింగ్ రిబ్బన్ కటింగ్ లు చేస్తున్నారని, ధాన్యం మాత్రం కొనుగోలు చేయలేని అధికారుల నిర్లక్ష్యం పట్ల రైతులందరూ మండిపడ్డారు. వడ్లు కొనుగోలు చేయలేక పోతే ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడిస్తామని రైతులందరూ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రైతులు చల్ల భూమిరెడ్డి , నారాయణరెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ హరి, రేసు రాములు , రంగయ్య, , గొడుగు ఎల్లయ్య , శ్రీనివాస్, రాజేశం సాయి తదితరులు పాల్గొన్నారు.