రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం, నియోజకవర్గం వెంకటాపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ అకాల వర్షానికి తడిసిపోయిన ధాన్యాన్ని బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సబేరా బేగం గౌస్ బాయి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అకాల వర్షానికి తడిసి ముద్ద అయిన వరి ధాన్యంను రైసు మిల్లులకు తరలించాలని రైతులు వారికి మొరపెట్టుకున్నారు.