థాయ్‌లాండ్ కు చెందిన ఉతై అమీ నంతఖాన్ అనే ట్రాన్స్ జెండర్ మహిళ.. జపాన్ పురుషులను మోసం చేసి వారి నుంచి రూ.6 కోట్లు కొల్లగొట్టింది. 13 ఏళ్లలో 73 మందిని మోసగించి ఈ మేరకు కాజేసింది. థాయ్‌లాండ్ పర్యటనకు వచ్చి పర్సు పోగొట్టుకున్నానని, పాస్ పోర్ట్ పునరుద్ధరణకు నగదు అవసరం అంటూ నటించి వారి నుంచి ఆమె డబ్బులు కాజేసేది. ఓ టూర్ లో తన జపనీస్ ప్రియుడు బిల్లులు కట్టకుండా మోసం చేసినందుకు ప్రతీకారంగా ఆమె ఈ మోసాలకు పాల్పడింది.