కవిత అరెస్ట్.. నెల రోజులైనా స్పందించని కేసీఆర్

570చూసినవారు
కవిత అరెస్ట్.. నెల రోజులైనా స్పందించని కేసీఆర్
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టయి సోమవారానికి సరిగ్గా నెల రోజులు అవుతుంది. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆమె తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించలేదు. కనీసం అరెస్టు అంశాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. అరెస్ట్ పై స్పందించకపోవడంతో ఇటు పార్టీలోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఎందుకు స్పందించడం లేదు. లోక్‌సభ ఎన్నికలే కారణమా? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అనేది సస్పెన్స్ గా మారింది.

సంబంధిత పోస్ట్