బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం అక్రమమని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ అరెస్టును బీఎస్పీ ఖండిస్తోందన్నారు. ఈడీని అడ్డం పెట్టుకుని మోదీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరలేపారని.. ఇది ముమ్మాటికీ అప్రజాస్వామికమని అన్నారు. ఇలాంటి అరెస్టులతో బెదిరేది లేదని, దేశంలో మోదీ పాలన నాజీల నియంతృత్వం కన్నా ఘోరంగా ఉందని ఎక్స్ వేదకగా విమర్శించారు.