కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా

35639చూసినవారు
కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వాయిదా వేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో తీర్పును స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా ఈ నెల 6కు వాయిదా వేశారు. కాగా మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆ తర్వాత విచారణలో భాగంగా ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో తనకు రెగ్యులర్ బెయిల్ కావాలని కవిత కోర్టును ఆశ్రయించారు.

సంబంధిత పోస్ట్