TG: కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్ రావులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. మేడిగడ్డ కుంగుబాటుకు కేసీఆర్, హరీశ్‌రావు, ఇతరుల అవినీతే కారణమని, దీనిపై కేసు పెట్టాలని భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి ఫిర్యాదు చేశారు. భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశాలు కొట్టివేయాలని KCR, హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించగా వాదనల అనంతరం విచారణను వాయిదా వేశారు.