నొప్పులు భరించలేరన్న భయంతో కొందరు, ఫలానా ముహూర్తానికే బిడ్డ పుట్టాలంటూ ఇంకొందరు అవసరం ఉన్నా, లేకపోయినా సిజేరియన్ చేయించుకుంటున్నారు. మహిళ ఆరోగ్యం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా సాధారణ ప్రసవమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. భర్తల సహకారం అందిస్తే ఇది సాధ్యమవుతోందని అంటున్నారు. ఇలా భార్యకు భర్త అన్నింటికీ చేదోడు, వాదోడుగా ఉండటం పుట్టే బిడ్డకే కాదు దంపతుల మధ్య అన్యోన్యతలకు ఒక టానిక్ లా పనిచేస్తుందని చెబుతున్నారు.