జైలు నుంచి నేడు కేజ్రీవాల్ విడుదల

53చూసినవారు
జైలు నుంచి నేడు కేజ్రీవాల్ విడుదల
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఆయనకు లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. మరో వైపు కేజ్రీవాల్ బెయిల్ కొట్టివేయాలని హైకోర్టును ED ఆశ్రయించనుంది. మార్చి 21న లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ED ఆయనను అరెస్టు చేసింది. లోక్‌సభ ఎన్నికల కోసం కేజ్రీవాల్‌ మే 10 నుంచి జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ పొందారు.

సంబంధిత పోస్ట్