క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం

77చూసినవారు
క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించింది. ఆయనను తీహార్ జైలు నుంచి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బుధవారం సీబీఐ ప్రవేశపెట్టింది. ఆ సమయంలో కేజ్రీవాల్ తన షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయని కోర్టుకు వెల్లడించారు. ఆయన అస్వస్థతకు గురి కావడంతో కోర్టు గది నుంచి మరో గదికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా ఎక్సైజ్ స్కామ్‌కు సంబంధించి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు ఢిల్లీ కోర్టు బుధవారం సీబీఐకి అనుమతి ఇచ్చింది.

సంబంధిత పోస్ట్