తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

319390చూసినవారు
తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో తాత్కాలిక సిబ్బంది నియామకానికి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 26 వైద్య కళాశాలల్లో 4,356 బోధనా సిబ్బంది నియామకానికి అనుమతినిచ్చింది. 3,155 కాంట్రాక్టు సిబ్బంది, గౌరవ వేతనంతో 1201 బోధనా సిబ్బంది నియామకాలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రొఫెసర్లు, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, సీనియర్‌ రెసిడెంట్ల నియామకాలు చేపట్టాలని జీవోలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్