సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కుమారుడు, హీరో శ్రీసింహ పెళ్లిపీటలెక్కారు. సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగను ఆయన పెళ్లి చేసుకున్నారు. UAEలో ఘనంగా జరిగిన ఈ వేడుకలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి సందడి చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రీవెడ్డింగ్ ఈవెంట్‌కు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మత్తు వదలరా, ఉస్తాద్, తెల్లవారితే గురువారం, భాగ్ సాలే సినిమాలతో శ్రీసింహ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.