ఊరూవాడ ప్రతిష్ఠించిన గణనాథులకు 9 రోజుల పాటు పూజలు చేసి భక్తులు ఆ ప్రతిమలను సోమవారం నిమజ్జనం చేశారు. ఖమ్మంలోని ప్రకాశ్ నగర్, కాల్వొడ్డు వద్ద మున్నేరులో విగ్రహాలను నిమజ్జనం చేయగా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పర్యవేక్షించారు. నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు ఏర్పాటు చేయగా.. వివిధ శాఖల సిబ్బంది, గజ ఈతగాళ్లను నియమించి వారి ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేయించారు.