ఖమ్మం: బీఆర్ఎస్ ధర్నాలపై మంత్రి తుమ్మల తీవ్ర విమర్శలు

67చూసినవారు
బీఆర్ఎస్ ధర్నాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రవిమర్శలు చేశారు. ఆదివారం ఖమ్మం నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రైతు బంధు సొమ్మును తమ ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు అయోమయానికి గురయ్యారని, కాంగ్రెస్ పాలనలో రైతు సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. సన్న వడ్లకు రూ. 500 బోనస్ తో రైతులను నిలబడేలా చేశామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్