అసంఘటిత రంగ కార్మికుల కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ పథకం అమల్లోకి తెచ్చింది. 18- 59 సంవత్సరాల మధ్య ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. కార్మికుడి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకంతో రూ.110 రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలు. గుర్తింపు కార్డు ఇస్తారు. ఐదేళ్లకోసారి రెన్యువల్ చేయించుకోవాలి. ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి ప్రమాద బీమా కింద రూ.6.30 లక్షలు, సాధారణ మరణమైతే రూ.లక్షా 30వేలు అందిస్తుంది.