ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం దానిని అమలు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. ఎస్సీవర్గీకరణ అమలు జరిపే వరకు పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. శుక్రవారం రాత్రి ఖమ్మంలో జరిగిన ఉమ్మడి జిల్లా మాదిగల ధర్మ యుద్ధసభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అమలుకోసం ఖమ్మం నుండే పోరాటం మొదలు పెడుతున్నామన్నారు.