కొత్తగా మంజూరైన డోర్నకల్ - మిర్యాలగూడ రైల్వే లేన్ అలైన్ మెంట్ మార్పునకు కృషి చేయాలని కోరుతూ ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డికి ఆయా మండలాల రైతుల తరఫున ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో ఈ రైల్వే లేన్ రానుందని. విలువైన వ్యవసాయ భూములకు నష్టం వాటిల్లుతోందని తెలిపారు.