ముదిగొండ తహశీల్దార్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం తహశీల్దార్ సునిత ఎల్జిబెత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి తహశీల్దార్ నివాళులర్పించారు. నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్రోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారని పేర్కొన్నారు.