ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను గురువారం వారి కార్యాలయంలో మధిర మండల కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకంగా కలిసి పలు గ్రామాలలో గల ప్రజా సమస్యలను వారికి వివరించారు. ఈ సందర్భంగా తక్షణమే సంబంధిత అధికారులతో చరవాణిలో మాట్లాడి వారి సమస్యలను తెలియజేసి పరిష్కరించడం జరిగింది.