ఆనందంగా చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన ఆదివారం ఖమ్మం జిల్లా మధిర మండలంలో జరిగింది. మల్లారం క్రాస్ రోడ్డు వద్ద చేపల వేట కోసం వెళ్లిన సిరిపురం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి మోరిలోకి దూరి అందులోనే ఇరుక్కుపోయాడు. వెంటనే కేకలు వేయడంతో సమీపంలో ఉన్న స్థానికులు వెంటనే జేసిబీని తెప్పించి సురక్షితంగా వెలికితీశారు. బయటకు వచ్చిన రాజు బ్రతుకు జీవుడా అంటూ పరుగులు తీశాడు.