ఖమ్మం జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లాలో అత్యుత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మధిర సర్వేయర్ గా ఉషారాణి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న సందర్భంగా మధిరలోని పలువురు ప్రముఖులు ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.