గోదాములను ఆకస్మికంగా పరిశీలించిన ఛైర్మన్

63చూసినవారు
గోదాములను ఆకస్మికంగా పరిశీలించిన ఛైర్మన్
మధిర మండలం దెందుకూరు గ్రామంలోని గోదాములను గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గురువారం ఆకస్మికంగా సందర్శించారు. గోదాముల్లో ఉన్న నిల్వలను ఆయన పరిశీలించారు. గోదాముల సామర్ధ్యంతో పాటు ఎంతమంది హమాలీలు ఉన్నారని, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఓబిసి సెల్ అధ్యక్షులు, కామేపల్లి సోసైటీ చైర్మన్ పుచ్చకాయల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్