పంట పొలాలను పరిశీలించిన మంత్రి

67చూసినవారు
పంట పొలాలను పరిశీలించిన మంత్రి
ఎర్రుపాలెం మండలం మినవోలు గ్రామంలోని వరద ముంపు ప్రాంతాల్లో గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. వరద ఉధృతికి దెబ్బతిన్న పంట పొలాలు, రహదారులను పరిశీలించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతీ అన్నదాత కుటుంబానికి అండగా అదుకుంటామని చెప్పారు. దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేస్తామన్నారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరావు, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గప్రసాద్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్