మధిర: కుల గణన సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: భట్టి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం వారి కార్యాలయంలో ప్రత్యేక పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేకు రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని కోరారు.