నేలకొండపల్లి: ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి

75చూసినవారు
నేలకొండపల్లి: ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన మంగళవారం నేలకొండపల్లి మండలంలో చోటు చేసుకుంది. చెరువుమాదారంకు చెందిన ధనావత్ గోపి గ్రామ సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్ళాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు చెరువులో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. గోపి మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్