మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం గ్రామంలో నిర్వహిస్తున్న జాతరలో అపశృతి చోటుచేసుకుంది. ఈ జాతరలో గుండెపోటుతో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంకు చెందిన పూజారి అమిదేవవురపు వెంకటేశ్వర్లు (48)అక్కడికక్కడే మృతి చెందారు. స్నానాల లక్ష్మీపురం జాతరలో భక్తులు అంటు స్నానాలు చేసి మృతి చెందిన వారి బంధువులకు పిండ ప్రదానాలు పెట్టి పూజలు నిర్వహిస్తారు. వైరా నదిలో పిండ ప్రధాన పూజలు చేసేందుకు వచ్చిన అర్చకుడు వెంకటేశ్వర్లు అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. పిండ ప్రధానల పూజలు చేస్తున్న వెంకటేశ్వర్లు గుండెపోటుతో అక్కడికక్కడే నిమిషాల వ్యవధిలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వైరా ఎస్సై శాఖమూరి వీరప్రసాద్ సంఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వివరాలను సేకరించి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్నానా లక్ష్మీపురం జాతరలో అర్చకుడు గుండెపోటుతో మృతి చెందడం భక్తులను కలిసివేసింది.