కూసుమంచి మండల కేంద్రంలో నేలకొండపల్లి రోడ్డులో రెడ్డి ఆటో మెకానిక్ షాపు వద్ద నిలిపి ఉంచిన ఆటోలో బ్యాటరీని గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. గత రాత్రి ఆటోను రిపేర్ కోసం షాప్ ముందు నిలిపి ఉంచారు. కాగా రాత్రి ఆటోలో బ్యాటరీని చోరీ చేస్తుండగా సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈమేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను పోలీసులు గురువారం విడుదల చేశారు.