కరెంట్ అఫైర్స్: జాతీయ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్‌ వృత్తి అగర్వాల్‌కు స్వర్ణం

80చూసినవారు
కరెంట్ అఫైర్స్: జాతీయ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్‌ వృత్తి అగర్వాల్‌కు స్వర్ణం
జాతీయ సీనియర్‌ అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్‌ వృత్తి అగర్వాల్‌ రెండు పతకాలు సాధించింది. సెప్టెంబ‌ర్ 11న హైదరాబాద్‌కు చెందిన వృత్తి అగర్వాల్‌ మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో విజేతగా నిలిచింది. అగర్వాల్‌ 1500 మీటర్లను అందరికంటే వేగంగా 17 నిమిషాల 45.63 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇందులో కర్ణాటకకు చెందిన షిరిన్ 2వ స్థానంలో, ఢిల్లీకి చెందిన భవ్య సచ్‌దేవా 3వ స్థానంలో నిలిచింది.

సంబంధిత పోస్ట్