సీతారామ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పచ్చి అబద్దాలు చెబుతుందని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. గురువారం కూసుమంచిలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కేవలం అధికార పార్టీ మీద బురద జల్లేందురు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందని అన్నారు. ఎవరెన్ని చెప్పినా ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.