వరద ధాటికి సర్వం కోల్పోయిన రాకాసి తండాను మంగళవారం కేంద్ర బృందం పరిశీలించింది. సెప్టెంబర్ నెల మొదటి వారంలో వచ్చిన భారీ వర్షాలకు, మండలంలోని అజ్మీరా తండా పరిధి, రాకాసి తండా సమీపాన ఉన్న ఆకేరు ఉధృతికి రాకాసి తండా ప్రజలు సర్వం కోల్పోయి నిరాశ్రయులైన విషయం తెలిసిందే. ఆకేరుకు వరద పోటెత్తడంతో బ్రిడ్జి, రోడ్లు, విద్యుత్ మరమ్మతు పనులు, దెబ్బతిన్న ఇండ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం పనులు పరిశీలించారు.