పాలేరు జలాశయం నీటి మట్టం నిలకడగా కొనసాగుతోంది. గరిష్ఠ నీటిమట్టం 23 అడుగులు కాగా, ప్రస్తుతం 21. 5 అడుగుల నీరు నిల్వ ఉంది. పాలేరు పరీవాహక ప్రాంతం నుంచి 3250 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. పాలేరు జలాశయం నుంచి ఎడమ కాల్వ రెండో జోన్ ఆయకట్టుకు రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఫాలింగ్ గేట్ల ద్వారా సుమారు 1500 క్యూసెక్కుల నీరు ఏటిలో కలుస్తోందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.