గుండెపోటుతో రైతు మృతి
పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తున్న ఓ రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన శనివారం పెనుబల్లి మండలం బ్రహ్మళకుంటలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం, భూక్యా కృష్ణ (46) తన ద్విచక్రవాహనంపై పొలం వద్దకు వెళ్లి వస్తుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.