ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం భవన పాలెం గ్రామం బిటి రోడ్డు అధ్వానంగా మారి రాకపోకలకు ఆటంకంగా మారడంతో పాటు వాహనాలు పడిపోయే ప్రమాదం ఉంది. ఈ బిటి రోడ్డు పై గౌరారం టోల్ ప్లాజా టోల్గేట్ కట్టుబడి ఉందని చెప్పి, అతి భారీ వెహికల్స్ కూడా ఈ బిటి రోడ్డు నుంచి వెళ్లడం జరుగుతుంది. దీనివల్ల బిటి రోడ్డు పూర్తిగా పాడైపోయింది. ఈ విషయమై ఆర్ అండ్ బి అధికారులు గాని , ప్రజా ప్రతినిధులు కానీ, పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీ అధికారులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. కావున ఈ విషయమై తక్షణమే అధికారులు స్పందించి, బిటి రోడ్డు, మరమ్మతులు చేయించాల్సిన గా భవన పాలెం గ్రామ ప్రజలు కోరుతున్నారు.