మహారాష్ట్రలో బీజేపీ గెలుపు సందర్భంగా శనివారం సత్తుపల్లి సుభాష్ చంద్రబోస్ రింగ్ సెంటర్ వద్ద బీజేపీ శ్రేణులు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు మాట్లాడుతూ. కాంగ్రెస్ మోసపు వాగ్దానాలను తిప్పి కొట్టి మహారాష్ట్ర అభివృద్ధి చెందాలంటే, సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలంటే బీజేపీతోనే సాధ్యమని భావించి గొప్ప మెజారిటీతో గెలిపించిన మహారాష్ట్ర ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు.