సత్తుపల్లి నీటి పారుదల శాఖ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా టీజీఐడిసీ ఛైర్మెన్ మువ్వా విజయబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో అసువులు బాసిన సమరయోధులకు అయన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. నీటి పారుదల శాఖ అభివృద్ధికి అధికారులు మరింత కృషి చేయాలని కోరారు.